జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు(జేపీఎస్) సర్కార్ శుభవార్త చెప్పింది. 455 మందిని గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులిచ్చింది. మొత్తం 9,355 మంది జేపీఎస్‌లు ఉండగా.. వారిలో 6,603 మందిని పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత డిసెంబర్‌లో 4,007 మందిని, తాజాగా మరో 455 మందిని క్రమబద్ధీకరించగా.. మరో 2,141 మందిని అక్టోబరు నాటికి క్రమబద్ధీకరించే అవకాశముంది.