రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాల ఎంపికకు రేషన్ కార్డు (ఆహార భద్రతా కార్డు)నే ప్రామాణికంగా తీసుకోవాలని సీఎం రేవంత్ సర్కార్ ప్రాథమికంగా నిర్ణయించింది. ఉచిత విద్యుత్‌కు సంబంధించి ఇంటి యజమాని ఆధార్, రేషన్ కార్డు ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు తీసుకోనున్నారు. కాగా, ఈ నెలలోనే ఈ రెండు పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తోంది