కష్టకాలంలో పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్ రైస్’ తీసుకొస్తుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ‘భారత్ రైస్’ విక్రయాలకు శ్రీకారం చుట్టనున్నారు. కేజీ భారత్ రైస్ ధర కిలో రూ.29 మాత్రమే. చౌరధరకే లభించే ఈ నాణ్యమైన బియ్యం సేల్స్‌ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్ వేదికగా ప్రారంభించనున్నారు