ఎంపీ బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఇళ్లకు అయోధ్య బాలరాముడి చిత్రపటాలను పంపిణీ చేయనున్నారు. అయోధ్య వెళ్లలేని వారు తమ ఇళ్లల్లోనే స్వామివారిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నాలుగు లక్షలకు పైగా హిందూ కుటుంబాలు ఉన్నట్లు వివరాలు సేకరించిన ఎంపీ.. 4.21 లక్షల అయోధ్య రాముని చిత్రపటాలను తయారు చేయించే పనిలో నిమగ్నమయ్యారు.