నేడు మ.12గంటలకు తెలంగాణ ఓటాన్ బడ్జెట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశంలో అన్ని అంశాలు ఉంటాయి అని పేర్కొన్నారు. దీనికి ముందు ఉదయం 9గంటలకు కేబినెట్ మీటింగ్ నిర్వహించి మంత్రి వర్గం బడ్జెట్ ను ఆమోదించనున్నారు. కాగా, బడ్జెట్ అంచనా రూ. 3లక్షల కోట్లు.