తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 సందర్భంగా నేడు ఉభయ సభల్లో చర్చ కొనసాగనుంది. సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల ప్రభుత్వ పాలనపై శ్వేత పత్రం విడుదల చేసి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన కృష్ణా జలాల అంశంపై కూడా ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది.