వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పు తాజా జాబితాలో వీరేనా..?

Spread the love

ఏపీలో అధికార వైసీపీ చేస్తున్న ఇన్ ఛార్జ్ ల మార్పులు మరికొంతకాలం కొనసాగే అవకాశాలున్నాయి. వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా ఇప్పటికే 60 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్ధానభ్రంశం తప్పలేదు. అలాగే పలువురు ఎంపీలకు కూడా ఈసారి సీట్లు దక్కడం లేదు. దీంతో వీరిలో పలువురు పార్టీలు మారిపోతున్నారు కూడా. ఈ నేపథ్యంలో తిరిగి వారిలో కొందరిని రప్పించుకుని సీఎం జగన్ చర్చలు జరుపుతున్నారు. అలాగే మరికొందరు ఎమ్మెల్యేలతోనూ జగన్ ఇవాళ భేటీ అయ్యారు.

 

రాష్ట్రంలో చేపడుతున్న వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా మరో జాబితా విడుదల చేసేందుకు సీఎం జగన్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. అలాగే ఇప్పటికే ఇన్ ఛార్జ్ లను మార్చిన చోట పరిస్ధితులను కూడా సమీక్షిస్తున్నారు. ఇదే క్రమంలో కృష్ణాజిల్లాకు చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్ ఇవాళ సీఎం జగన్ ను కలిశారు. దీంతో ఈసారి మార్పులు చేర్పుల్లో వీరు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.

 

అలాగే రాష్ట్రంలో పలు ఎంపీ సీట్లలోనూ మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. ఇప్పటికే వరుసగా వెలువడిన జాబితాల్లో ఉన్న ఎంపీలు పార్టీకి వరుసగా రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్న పరిస్ధితుల్లో ఈ ప్రక్రియ కాస్త ఆగింది. ఇప్పుడు తిరిగి సదరు ఎంపీల స్ధానాల్లో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు జగన్ కసరత్తు ప్రారంభించారు. ఇందులో నంద్యాలతో పాటు పలు సీట్లు ఉన్నాయి. దీంతో ఈసారి విడుదల చేయబోయే జాబితాలో నంద్యాల, గుంటూరుతో పాటు పలు స్ధానాలు ఉండొచ్చని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *