సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్ ఇంట విషాదం..

Spread the love

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్ ఇంట విషాదం నెలకొంది. సెంథిల్ భార్య‌, యోగా టీచర్‌ రూహి మ‌ర‌ణించారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. రూహి అంత్యక్రియలు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయ‌ని తెలిసింది. కాగా, సెంథిల్ కుమార్.. సై, ఛత్రపతి, అరుంధతి, మగధీర, బాహుబలి, RRR వంటి హిట్ సినిమాలకు ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *