ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు దక్కించుకున్న బీఆర్ఎస్ కు అక్కడ కూడా బిగ్ షాక్ తగలనుంది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు కాంగ్రెస్ లో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి పొంగులేటితో పాటు ఇతర ముఖ్య నేతలతో ఆయన చర్చలు రుపుతున్నారట. లోక్ సభ ఎన్నికలకు ముందే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. దీనిపై వెంకట్ రావు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.