ఫోన్ ట్యాపింగ్ కేసు.. రంగంలోకి ఈడీ..!

Spread the love

రోజుకో మలుపు తిరుగుతూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈడీ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. రాధా కిషన్ రావు స్టేట్ మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. గత ఎన్నికల్లో BRS డబ్బులు పోలీసు వాహనాల్లో తరలించానంటూ రాధా కిషన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చారు.

 

హవాలా మార్గంలో నగదు తరలింపుపై ఈడీ ఆరా తీయనుంది. రాధా కిషన్ రావు పోలీస్ వాహనాల్లో ఎన్ని కోట్లు తరలించారు. ఈ వివరాలను దర్యాప్తు బృందాన్ని ఈడీ అధికారులు అడిగి తెలుసుకోనున్నారు.

 

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో వేణుగోపాల్‌ రావు కీలకంగా మారారు. రిటైర్‌మెంట్‌ తర్వాత SIBలో రెండేళ్లపాటు ఓఎస్డీగా కొనసాగారు ఆయన. SIBలో అదనపు ఎస్పీగా విధుల నిర్వహించారు.

 

నలుగురు అదనపు ఎస్పీల కనుసన్నల్లోనే SIB నడిచినట్లు గుర్తించారు దర్యాప్తు బృదం. 4 ఏరియాలను మానిటరింగ్‌ చేసినట్లు గుర్తించారు. వేణుగోపాల్‌ రావు నుంచి దర్యాప్తు టీమ్ మరిన్ని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. రాధా కిషన్ రిమాండ్ రిపోర్ట్‌తో వేణుగోపాల రావు బాగోతం వెలుగులోకి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *