కార్పొరేట్ విద్యాసంస్థలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ కాలేజ్‌లు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తుండడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. అనుమతులు లేకుండా కొనసాగుతోన్న కార్పొరేట్ కాలేజ్‌లపై చర్యలు చేపట్టడమే కాకుండా.. ఫీజ్‌ల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం అసెంబ్లీ సమావేశాలల్లో ఈ చట్టాన్ని తీసుకురానున్నట్లు సమాచారం.