రూ.315 కోట్ల లంచం కేసు.. మెఘా ఇంజనీరింగ్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ..

Spread the love

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం(ఏప్రిల్ 13), మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌తో పాటు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులపై కేసు నమోదు చేసింది. PTI నివేదించిన ప్రకారం ₹315 కోట్ల NISP ప్రాజెక్ట్‌లో అవినీతి ఆరోపణలపై కేసు దాఖలు చేసింది.

 

మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇండస్ట్రియల్ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరు, కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన ఎనిమిది మంది అధికారులు NISPకు చెందిన రూ. 315 కోట్ల ప్రాజెక్టు అమలులో లంచం తీసుకున్నారనే ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది.

 

జగదల్‌పూర్ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి రూ. 174 కోట్ల బిల్లుల చెల్లింపు విషయంలో రూ.78 లక్షలు లంచం తీసుకున్నారని సీబీఐ ఎన్ఎమ్‌డీసీ అధికారులపై కేసు నమోదు చేసింది.

 

మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అతిపెద్ద దాతలలో ఒకటి, టాప్ 10 దాతల జాబితాలో ఉంది. గత నెలలో భారత ఎన్నికల సంఘం బహిరంగపరచిన జాబితా ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన మౌలిక సదుపాయాలు, నిర్మాణ సంస్థ, దాని సంబంధిత సంస్థ వెస్ట్రన్ UP పవర్ ట్రాన్స్‌మిషన్ కో. ₹1,186 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *