తెలంగాణ రాష్ట్రం, వికారాబాద్ జిల్లాలోని ఎన్నేపల్లి గ్రామంలో పాపరాజు గంగరాజు గురువుల 37వ ఆరాధన దినోత్సవ కార్యక్రమాలను భక్తుల ఆధ్వర్యంలో విజయమాంబ ఆశీస్సులతో ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క వేడుకలకు విజయమాంబ గారి ఆశీస్సులు పొందిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మరియు అతని సతీమణి కోవూరి జ్యోతి గారు హాజరై ఆనందాశ్రమం యొక్క వేడుకలలో పాల్గొని విజయమాంబ గారిని శాలువాలతో పూలమాలతో ఘనంగా సత్కరించి ఆశీస్సులు పొందారు, అనాది కాలం నుండి పాప రాజు, గంగరాజు గురువుల గురు దీక్ష పొందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆనందాశ్రమం యొక్క 37వ ఆరాధన దినోత్సవంను ఘనంగా జరిపారు అని తెలియజేస్తూ , విజయమాంబ గారి ఆశీస్సులు పొందిన భక్తులందరూ , లక్ష్యసాధన కోసమై ఆనందాశ్రమం అభివృద్ధి కొరకై భావితరాలకు ఉపయోగపడేందుకు అందరి బాధ్యతగా భావించి నిరంతరం కృషి చేస్తే అందుకు తన వంతు బాధ్యతగా ఆనందాశ్రమము అభివృద్ధి కొరకై బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ముందుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి తోడ్పడుతానని తెలియజేశారు. అందుకు అక్కడికి విచ్చేసిన భక్తులందరూ బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ను అభినందించి మర్యాదపూర్వకంగా కృతజ్ఞతా భావం తెలిపి లక్ష్యసాధన కోసం అందరం కలిసికట్టుగా పని చేస్తామని తెలియజేశారు.ఈ యొక్క వేడుకలలో కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ముందుకు నడిపిస్తున్న అంజన్న గారు, కరాటే మాస్టర్ అశోక్ గారు, శ్రీశైలంగౌడ్ స్వామి గారు, వెంకటేశం, మరియు గురు మార్గంలో ఉన్న భక్త బృందం అధిక సంఖ్యలో పాల్గొన్నారు.