కోవూరి జ్యోతి, న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించిన- వికారాబాద్ జిల్లా ఆనందాశ్రమం భక్తులు.

Spread the love

వికారాబాద్ జిల్లా, ఎన్నేపల్లి గ్రామంలో ఆనంద ఆశ్రమంలో 21వ గురువు అయిన విజయమాంబ గారి గురు భక్తి మార్గంలో ఉన్న భక్తులు బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ను పాపరాజు, గంగరాజు గారి 37వ ఆరాధన దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇట్టి కార్యక్రమానికి భక్తిశ్రద్ధలతో హాజరైన కోవూరి జ్యోతి, న్యాయవాధి కోవూరి సత్యనారాయణ గౌడ్ దంపతులను మర్యాదపూర్వకంగా శాలువాలతో విజయమాంబ గురు భక్తి మార్గంలో ఉన్న భక్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంలో బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ విజయమాంబ గారి గురుభక్తి మార్గంలో ఉన్న భక్తుల అందరి ఆశీర్వాదంతో తనను విజయపతంలో ముందుకు నడిపిస్తున్నందుకు వికారాబాద్ జిల్లా పాపారాజు, గంగరాజు ఆనందాశ్రమము భక్త మహాశయులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా అందరి ఆశీర్వాదం, బుద్ధి, బలం తోడైతే ఆనందాశ్రమమును సుందర వందనముగా తీర్చిదిద్దుతానని తెలియజేశారు. ఈ సందర్భంలో అక్కడికి విచ్చేసిన భక్త మహాశయులందరూ బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ను అభినందించి , ఆశీర్వదించి కృతజ్ఞతా భావం తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆనందాశ్రమం కార్యక్రమాలను నిర్వహించిన అంజన్న గారు, కరాటే మాస్టర్ అశోక్ గారు, శ్రీశైలం గౌడ్ స్వామి గారు, మరియు ఆనందాశ్రమం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *