కేరళకు సీఎం రేవంత్..

Spread the love

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బిజిబిజీగా ఉన్నారు. ఓ వైపు ఎన్నికల సభలకు హాజరవుతూనే ముఖ్యనేతల ప్రచారంలో నిమగ్నంకానున్నారు. తాజాగా ఆయన రెండురోజులపాటు కేరళ వెళ్తున్నారు.

 

ఈ టూర్‌లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా వయనాడు, అలెప్పీలోని ముఖ్యమైన టౌన్లలో ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. అక్కడి నుంచి నేరుగా ఈనెల 19న మహబూబ్‌నగర్, మహబూబాబాద్ సభలకు హాజరుకానున్నారు.

 

మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి చేత ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రచారం చేయించాలని భావిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. కర్ణాటకలో తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగియగానే.. అక్కడి నేతలతో కలిసి ఏపీకి సీఎం రేవంత్ వస్తారని అంటున్నారు. నాలుగైదు సభలకు ఆయన హాజరుకావచ్చన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. రీసెంట్‌గా విశాఖలో ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన సభకు సీఎం రేవంత్‌రెడ్డి అటెండయ్యారు. అక్కడి నుంచి మాంచి స్పందన వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *