తెలంగాణకు అమిత్ షా, ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే..

Spread the love

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర పెద్దలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి క్యూ కడుతున్నారు. రేపు (ఏప్రిల్ 25) కేంద్రమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సిద్ధిపేటలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరై.. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తరపున ప్రచారం చేయనున్నారు.

 

ఇక ప్రధాని నరేంద్ర మోదీ.. ఏప్రిల్ 30న తెలంగాణకు రానున్నారు. 30, మే 3,4 తేదీల్లో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారసభలు నిర్వహించనున్నారు. 30 జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్ నియోజకవర్గంలో సభ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం శేరిలింగంపల్లిలో ఐటీ ఉద్యోగులతో సమావేశమవుతారు.

 

మే 3వ తేదీన వరంగల్ పార్లమెంట్ పరిధిలో, ఉమ్మడి నల్గొండ పార్లమెంట్ పరిధిలో కలిపి నిర్వహించే ఒక సభలో పాల్గొంటారు. మే 4వ తేదీన మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం, నారాయణపేటలో..అదే రోజున చేవెళ్ల పార్లమెంట్ వికారాబాద్ లో సభ నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *