జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రెండు నామినేషన్లు దాఖలు చేసిన- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్…

Spread the love

సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల అధికారి శ్రీమతి వల్లూరు క్రాంతి సంగారెడ్డిజిల్లా కలెక్టర్ గారికి స్వతంత్ర అభ్యర్థి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ పత్రాలను సమర్పించారు. రెండు జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ పత్రాలను విజయవంతంగా దాఖలు చేసిన తదనంతరం జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల అధికారి ప్రతిజ్ఞ చేయించారని తెలియజేశారు.ఈ తరుణంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల ఢిల్లీలో ఎన్నో ధర్నాలు నిర్వహించిన అట్టి ధర్నాలకు మద్దతు పలకనటువంటి తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపీలుగా గెలిచిన గత నాయకులు మద్దతు ఇవ్వక పోవడం ఎంతో సిగ్గు చేయటు అని భావించి ఇలాంటి వారిని పార్లమెంట్ లోకి పంపిస్తే వాళ్ల ఆస్తులను కూడ పెట్టుకోవడానికి మాత్రమే పనికొస్తారు కానీ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పనికిరారని తెలియజేశారు.కావున ఇలాంటి నాయకులకు జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలియజేశారు. అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంట్ ప్రజాక్షేత్రం కొత్త మార్పు కోరుకుంటూ స్వతంత్ర అభ్యర్థిగా న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ని గెలిపిస్తారని అందుకు ఈ ప్రజాక్షేతానికి సేవ చేసుకుంటూ ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై ఉంటూ ప్రజా సమస్యలను తీరుస్తానని తెలియజేశారు. నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న మానయ్య, నర్సింలు, మాధవి పద్మ, సుజాత మరియు జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *