నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ‘కల్కి 2898ఏడీ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్‌ను డార్లింగ్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నారు. ‘డార్లింగ్స్. మీకు ఒక చిన్న సర్‌ప్రైజ్. వేచి ఉండండి’ అని వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారంటూ టాక్ నడుస్తోంది. దీనిపై క్లారిటీ ఇవ్వొచ్చని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.