ఢిల్లీ లిక్కర్ కేసు.. కవిత బెయిల్ పై నేడే తీర్పు.. బీఆర్ఎస్ లో ఉత్కంఠ..

Spread the love

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై.. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై నేడు తీర్పు వెలువడనుంది. సీబీఐ, ఈడీ పెట్టిన కేసుల్లో కీలక నిందితురాలిగా ఉన్న కవిత బెయిల్ భవితవ్యం నేడు తేలనుంది. రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా నేడు బెయిల్ పై తీర్పు ఇవ్వనుంది. కవిత బెయిల్ పై ఎలాంటి తీర్పు వస్తుందోనని బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

 

లిక్కర్ స్కామ్ పై ఈడీ, సీబీఐ పెట్టిన రెండు కేసుల్లోనూ కోర్టులో ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. మార్చి 15న ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాల అనంతరం అరెస్ట్ చేసి ఢిల్లీ కోర్టులో హాజరు పరిచి కస్టడీకి తీసుకున్నారు. మరోసారి కస్టడీ పొడిగించాక.. ఆ గడువు కూడా పూర్తవ్వగా తీహార్ జైలుకు పంపారు. జైలులో ఉన్న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కవిత జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లోనే ఉంది. రేపటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుండగా.. నేడు బెయిల్ పై తీర్పు వెలువడనుంది. మరి కవితకు అనుకూలంగా తీర్పు వస్తుందా ? లేక మళ్లీ నిరాశ తప్పదా ? అన్నది చూడాలి.

 

కోర్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా విచారణ హజరయ్యేలా అనుమతివ్వాలని కవిత తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కూడా జడ్జి కావేరి బవేజా నేడు నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

 

ఏప్రిల్ 22న బెయిల్ పిటిషన్లపై విచారణ చేసిన కోర్టు.. ఇరుపక్షాల వాదనల అనంతరం మర్నాటికి తీర్పును వాయిదా వేసింది. ఏప్రిల్ 24న బెయిల్ పిటిషన్లను పరిశీలించిన న్యాయమూర్తి.. తీర్పును మే 2కు వాయిదా వేశారు. కానీ.. ఆ రోజు కూడా తీర్పును వెలువరించలేదు. తుదితీర్పును మే6కు వాయిదా వేశారు. మరి ఈ రోజైనా బెయిల్ వస్తుందా లేక కవిత తీహార్ జైలుకే పరిమితమవుతుందా అన్నది కోర్టు ఇచ్చే తీర్పుతో తేలిపోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *