మరోసారి పల్నాడు ఫ్యాక్షన్ భగ్గుమంది. గుంటూరు జిల్లా కారంపూడిలో వైసీపీ మూకలు రెచ్చిపోయారు..

Spread the love

మరోసారి పల్నాడు ఫ్యాక్షన్ భగ్గుమంది. గుంటూరు జిల్లా కారంపూడిలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. టీడీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో దాడికి దిగాయి. అంతేకాకుండా టీడీపీ ఆఫీసులోని ఫర్నీచర్ తో పాటు రెండు దుకాణాలను ధ్వంసం చేశాయి.

 

దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. దాడులకు పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేయగా, సీఐకి గాయాలయ్యాయి. దీంతో కారంపూడిలో ఉద్రిక్తత నెలకొంది. ఇంతటితో ఆగకండా టీడీపీ నేత జానీబాషా వాహనానికి నిప్పుపెట్టారు వైసీపీ మూకలు.

 

వైసీపీ శ్రేణులు తెలుగు దేశం పార్టీ కార్యాలయం పక్కన ఉన్న దుకాణాలను ధ్వంసం చేయడంతో చిరువ్యాపారులు లబొదిబొమంటున్నారు. రాజకీయాలకు తమ వ్యాపారాన్ని, తమ ఉపాధిని ధ్వంసం చేశారని కన్నీరుమున్నీరవుతున్నారు.

 

దీంతో మాచర్ల నియోజకవర్గంలో 144 సెక్షన్ విధిస్తూ జిల్లా ఎస్పీ నిర్ణయం తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ బింధు మాధవ్ బిందు మాధవ్ హింసను సహించేది లేదని తేల్చి చెప్పారు.

 

మాచర్లకు అదనపు పోలీస్ బలగాలు పంపుతుతన్నట్లు ఏపీ డీజీపీ తెలిపారు. మాచర్ల నియోజకవర్గ పరిధిలో హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *