కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్ లో జరిగిన ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు బిష్కెక్‌లోని భారత రాయబారి అరుణ్ కుమార్ ఛటర్జీని సంప్రదించి వివరాలు సేకరించారు.
భారతీయ విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని అరుణ్ కుమార్ ఛటర్జీ తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితులకు స్పందించడానికి ఎంబసీ హెల్ప్‌లైన్ పూర్తిగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతున్నాయి..భారతీయ విద్యార్థులందరూ ప్రిపరేషన్ మోడ్‌లో ఉన్నారని తెలిపారు. కిర్గిజ్ స్థాన్ ఘటనలో భారతీయ విద్యార్థులెవరూ గాయపడలేదని, ఆసుపత్రిలో చేరలేదని తెలిపారు. సోషల్ మీడియా పోస్ట్‌లు వాస్తవం కాదని భారత రాయభారి ధృవీకరించారు.
కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెర్ లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ విద్యార్ధులు ఉంటున్న హాస్టళ్లపై దాడులు జరుగుతున్నాయి. అయితే గొడవలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇక్కడ వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కిర్గిజ్ స్థాన్ ఘటనపై అధికారులను ఆరా తీసారు.