జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా జూన్ 2న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ వేడుకలు నిర్వహించేందుకు ఈసీ అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఆ రోజు గన్ పార్క్ లోని ఉన్న అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు.