బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. భూ వివాదంలో ఆయనపై చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు సమాచారం. జీవన్ రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. భూమిని కబ్జా చేసి, అనుచరులతో తనను బెదిరించారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.