సాధారణ పరిపాలన శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లను స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సూచించింది. సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎటువంటి పత్రాలు కానీ, వస్తువులు కానీ బయటకు తీసుకెళ్లొద్దంటూ ఆ ఆదేశాల్లో జీఏడీ పేర్కొన్నది.
ప్రత్యేకించి మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్త్రాలు, కాగితాలను తరలించేందుకు వీలు లేదంటూ అందులో స్పష్టం చేసింది. అదేవిధంగా వాహనాల తనిఖీలు నిర్వహించాల్సిందిగా సచివాలయ భద్రతను చూసే ఎస్పీఎఫ్ సిబ్బందిని ఆదేశించింది. జూన్ 3న మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని తెలిపింది.