గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. పశుసంవర్థక శాఖ మాజీ సీఈ రాంచందర్, మాజీ ఓఎస్డీ కల్యాణ్ ను అరెస్ట్ చేశారు. రూ. 2.10 కోట్ల విలువైన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వీరిని శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.