లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు పూర్తి విరుద్దంగా ఉంటాయని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ మోదీ మూడో సారి ప్రధాని అవుతాయని చెప్పాయి. దీనిపై మీడియా సంస్థలు సోనియాను ప్రశ్నించగా..జస్ట్ వెయిట్ అండ్ సీ. వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు పూర్తిగా విరుద్దంగా ఉంటాయిని ఆశిస్తున్నాం అని ఆమె సమాధానం ఇచ్చారు.
తమిళనాడు దివంగత మాజీ సీఎం కరుణానిధి 100వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని డీఎంకే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోనియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరుణానిధికి ఆమె నివాళులు అర్పించారు. అనంతరం ఎన్నికల ఫలితాలపై తాము ఆశాభావంతో ఉన్నామని సోనియా గాంధీ తెలిపారు. జూన్ 4 వరకు వేచి చూద్దాం అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ కూడా ఎగ్జిట్ పోల్స్.. మోడీ మీడియా పోల్స్ అని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి 295 సీట్లు తగ్గకుండా గెలుస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయని సోనియా గాంధీ తెలిపారు.
మోదీ నేతృత్వంలో దేశంలో మూడో సారి ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తుందని వివిధ సర్వే సంస్థలు అంచనా వేయడంతో వీటిపై పలువురు నేతలు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు మోదీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు.. కానీ వాటికి విరుద్ధంగా ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.