బీజేపీ నేతల మీటింగ్, చంద్రబాబు, నితీష్‌ డిమాండ్లపై చర్చ..!

Spread the love

ఢిల్లీలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. రెండు రోజుల్లో నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టుకుంది బీజేపీ. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఇరుగుపొరుగు దేశాల అధ్యక్షులను పిలుస్తోంది.

 

ఇదిలావుండగా గురువారం మధ్యాహ్నం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అమిత్ షాతోపాటు సీనియర్లు, ఆర్ఎస్ఎస్ నేతలు భేటీ అయ్యారు. ఎన్డీయేకు వచ్చిన మెజార్టీ గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలో ఎన్డీయే మిత్రులు కోరుతున్న మంత్రుల శాఖలపై ఆయా నేతలు చర్చించినట్లు ఢిల్లీలో వార్తలు జోరందుకున్నాయి.

 

బీహార్ సీఎం నితీష్‌కుమార్.. స్పెషల్ స్టేటస్‌తోపాటు కీలకమైన మూడు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటిలో రైల్వేలు, గ్రామీణాభివృద్ధి, జల్‌శక్తి లేదా వ్యవసాయ శాఖ అడిగినట్టు సమాచారం. మిత్రులు ఎక్కువ శాఖలు కోరడంతో ఈసారి కొంతమంది నేతలకు మంత్రి పదవులు దక్కడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది.

 

టీడీపీ కూడా ఏపీకి స్పెషల్ ప్యాకేజ్, కేపిటల్ అభివృద్ధికి నిధులు, స్పీకర్, షిప్పింగ్, ఐటీ, గ్రామీణాభి వృద్ధి, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు శాఖలపై చర్చ జరిగినట్టు సమాచారం. మరి భేటీలో ఆయా నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గెలిచిన ఎంపీలంతా ఢిల్లీకి రావాలని పీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక ఎన్డీయే మిత్రులకు బుధవారం రాత్రి మోదీ, ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మొత్తానికి మరి మంత్రుల శాఖల గురించి శుక్రవారం సాయంత్రానికి ఓ కొలిక్కి రావచ్చని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *