ఏపీలో సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో నూతన సీఎస్ గా నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎస్ రేసులో పలువురు సీనియర్ IASలు ఉన్నప్పటికీ.. నీరభ్ కుమార్, విజయానంద్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. వీరిద్దరూ చంద్రబాబు కోటరీలో గతంలో పనిచేసిన వారే.
ఇద్దరూ చంద్రబాబుకు సన్నిహితులే కావడంతో.. సీనియారిటీ ఆధారంగా 1987 బ్యాచ్ IAS అధికారి నీరబ్ కుమార్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు పూర్తి టీమ్ ను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
నీరభ్ కుమార్ 2014 నుంచి 2019 చంద్రబాబు ప్రభుత్వంలో పలు కీలక శాఖలకు ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్నారు. ఇప్పటిదాకా సీఎస్ గా కొనసాగిన జవహర్ రెడ్డి నిన్నటి నుంచి సెలవుపై వెళ్లారు. ఆయన ఈనెలాఖరులోగా పదవీ విరమణ చేయనున్నారు.
కాగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో.. సీఎంవో ఎవరనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.