కేజ్రీవాల్‌కు దక్కని ఊరట..!

Spread the love

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది. జూన్ 14న విచారణ చేపట్టనున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ తిహార్ జైలులో ఉండగా అనారోగ్య కారణాల వల్ల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర బెయిల్ అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 19 వరకు పొడగించింది.

 

కేజ్రీవాల్ ఆరోగ్య అవసరాల విషయంలో జాగ్రత్తలు అవసరం తీసుకోవాలని కోర్టు అధికారులకు సూచించింది. అంతే కాకుండా రెగ్యులర్ బెయిల్ కోసం కేజ్రీవాల్ వేసిన పిటిషన్ విచారణ జరిపింది. కేజ్రీవాల్ ఆరోగ్యం సరిగా లేదని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే దీనిని ఈడీ వ్యతిరేకించింది. కేజ్రీవాల్ మోసం చేయాలని చూస్తున్నారని కోర్టు ఆరోపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *