కాసేపట్లో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. అధికార లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఫిల్మ్ సిటీలో రామోజీరావుకు తుది వీడ్కోలు పలకనున్నారు. ఉదయం 9 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. రామోజీని కడసారి చూసేందుకు సామాన్యులతో పాటు.. ప్రముఖులూ ఫిల్మ్ సిటీకి వస్తోన్నారు.
రామోజీ అంత్యక్రియలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఇప్పటికే రామోజీరావుకు అశ్రు నివాళి అర్పించారు. రామోజీఫిల్మ్‌సిటీలోని తన నివాసం నుంచి ఫిల్మ్‌సిటీ ప్రాంగణం వరకు అంతిమ యాత్ర జరగనుంది. రెండ్రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు, పెద్దఎత్తున ప్రజాప్రతినిధులు రానున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు చేశారు.