తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష, దాదాపు నాలుగు లక్షల మందికిపైగా…

Spread the love

తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష కాసేపట్లో మొదలుకానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు సిద్ధం చేశారు. ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జామ్ జరగనుంది.

 

పరీక్ష రాసే అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచన చేశారు. లేకుంటే అనుమతించేది స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మొత్తం 31 జిల్లాల్లో 897 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

 

గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ అత్యధికంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులను భారీ ఎత్తున మొహరించింది ప్రభుత్వం. పరీక్ష రాసే అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. హాల్ టికెట్ కలర్ ప్రింట్ తీసుకోవాలన్నది అందులోని కీలక సూచన.

 

దీనికితోడు హాట్ టికెట్ పై లేటెస్ట్ ఫోటోను అభ్యర్థులు అంటించాలి. ఫోటో ఐడెంటిటీ కార్డును తప్పనిసరిగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. అనుకున్న సమయానికి ఏమాత్రం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *