కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి సూసైడ్ చేసుకున్నారు. వివరాల ప్రకారం.. హైదరాబాద్ అల్వాల్‌లోని పంచశీల కాలనీలో ఇంట్లో గురువారం సాయంత్రం ఉరి వేసుకొని ఆత్యహత్యకు పాల్పడగా.. అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది.
వికారాబాద్ జిల్లాలో రూపాదేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆమె రెండు రోజుల నుంచి పాఠశాలలకు వెళ్లలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఎమ్మెల్యే ఉదయమే చొప్పదండి నియోజకవర్గానికి వెళ్లి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. అయితే ఎమ్మెల్యే సతీమణి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియరాలేదు.
ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఇతర బంధువులతో కలిసి కొద్దిరోజుల క్రితం తిరుమలతోపాటు ఇతర పుణ్యక్షేత్రాలను దర్శించుకొని వచ్చినట్లు తెలుస్తోంది. రూపాదేవి మృతదేహాన్ని పోలీసులు కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.