ఏపీలో మళ్లీ ఉద్రిక్తత.. ప్రత్యర్థుల దాడిలో టీడీపీ మహిళా నేత మృతి..!

Spread the love

ఏపీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి, శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీదేవి మృతిచెందింది. భాస్కర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.. ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని శ్రీదేవి మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *