విమానంలో మినిమం 100 మందికి పైగానే ప్రయాణికులు ఉంటారు. అదే తరహాలో బస్సును తీసుకొస్తే ఎలా ఉంటుంది? దీనిపై ఆలోచన చేస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్.
ఇప్పటికి ఆ ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గతంలో చెక్ రిపబ్లిక్‌కు వెళ్లారు. ఆ దేశ రాజధానిలో పరాగ్వేలో మూడు బస్సులు కలిపి ఒకటిగా ఉండడం గమనించారు. ఆ తరహా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఇండియాలో అయితే బాగుంటుందని అనుకున్నారు. దాన్ని నాగ్‌పూర్‌లో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారాయన.