అమెరికాకు సీఎం రేవంత్..షెడ్యూల్ ఇదే..!

Spread the love

సీఎం రేవంత్ రెడ్డి మరో విదేశీ పర్యటన ఖరారైంది. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఈ ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్, లండన్, దుబాయ్ దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం అమెరికా పర్యటన ఖరారైనట్లు సీఎంవో ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 3వ తేదీన అమెరికాకు బయలు దేరనున్నారు.

 

రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన సాగనున్నట్లు తెలుస్తోంది. అగ్ర రాజ్యంలోని డల్లాస్ వంటి రాష్ట్రాల్లో ఈ బృందం పర్యటించనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ అగ్ర రాజ్యంలోని పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామిక వేత్తలను కలవనున్నారు. వారితో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబులు పెట్టాల్సిందిగా కోరనున్నారు.

 

ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న కంపెనీల గురించి వారికి చెప్పి ఇన్వెస్ట్మెంట్లు తెలంగాణ రాష్ట్రానికి తీసుకురానున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం ఎంతటి అనువైన ప్రాంతమో వివరించనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆహ్వానించి కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఎనిమిది రోజులపాటు అగ్రరాజ్యంలో పర్యటించి రేవంత్ రెడ్డి బృందం తిరిగి ఆగస్టు 17 వ తేదీన హైదరాబాద్‌కు చేరుకోనుంది.

 

ఈ పర్యటనలో గతం కంటే ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించాలని సీఎం టీమ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇక ఈ ఏడాది జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి స్విర్ఖర్లాండ్‌తో పాటు ఇతర దేశాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక ద్వారా భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చారు. దాదాపు 4 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఈ పర్యటనలో ఒప్పందాలు కుదిరాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *