ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ భేటీ..! ఆ అంశాలపై చర్చ..!

Spread the love

ఆగస్టు 1న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ కానున్నది. పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మంత్రులతోపాటు పలువురు ఉన్నతాధికారులు కూడా భేటీలో పాల్గొననున్నారు.

అయితే, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2న ముగియనున్నాయి. నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై చర్చ తరువాత ద్రవ్య వినిమియ బిల్లుకు ఈ నెల 31న అసెంబ్లీ ఆమోదం తెలపనున్నది. ఆ తరువాత ఆగస్టు 2న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. కాగా, అసెంబ్లీ సమావేశాల ముగింపునకు ఒక్క రోజు ముందు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుండడం ఆసక్తిగా మారింది. జాబ్ క్యాలెండర్, రైతు భరోసా గైడ్ లైన్స్ తో పాటు ఇతర పలు కీలక అంశాలపై కేబినెట్ డిస్కస్ చేయనున్నట్లు టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *