ఏపీలో ఆక్వా, మెరైన్ ఫిషింగ్ వర్సిటీ ఏర్పాటు..?

Spread the love

ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక విషయాలను వెల్లడించారు. కృష్ణా జిల్లాలోని గిలకలదిండిలో ఉన్న ఫిషింగ్ హార్బర్ పనులను కేంద్ర పర్యావరణ, మత్స్యశాఖ అధికారుల బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర పలు విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆక్వా, మత్స్య పరిశ్రమ సమస్యల గురించి కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. మడ అడవుల పెంపకానికి సహకరించాలంటూ వారిని కూడా ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా మచిలీపట్నంలో ఆక్వా, మెరైన్ ఫిషింగ్ వర్సీని ఏర్పాటు చేయాలంటూ కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి వివరించారు. సముద్ర తీరం వెంబడి జాతీయ రహదారిని నిర్మించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరుతామంటూ మంత్రి చెప్పారు. మచిలీపట్నం – రేపల్లె మార్గాలను కలపాలంటూ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్తామంటూ ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *