కాట్రావుపల్లిలో పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్
కాకినాడ బ్యూరో నవంబర్ 05 2026 (సంచలన వార్త)
జగ్గంపేట, నవంబరు 5: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావుపల్లి గ్రామంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ గురువారం పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను అసిస్టెంట్ కలెక్టర్ ప్రియతో కలిసి సందర్శించారు. పోలింగ్ జరుగుతున్న తీరును, ఓటర్ల హాజరును, ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.