ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి
సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు నెరవేరాలి
డోర్నకల్ ప్రతినిధి ఆగస్టు 18 సంచలన వార్త:
డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ముందుగా సర్వాయి పాపన్నకు పెద్ద గౌడు బోయినపల్లి మల్లయ్య పూలమాలవేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.అనంతరం గీత కార్మికులు పూల మాలలు వేసి సర్వాయి పాపన్న ఆశయాలు నెరవేరాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో నారాటి సతీష్, బోయినపల్లి నాగేశ్వరరావు,కడెం బిక్షం, బత్తిని ఉపేందర్,అంబటి వీరేందర్, బోయినపల్లి ఉపేందర్,బోయినపల్లి పుల్లయ్య,బోయినపల్లి బిక్షం,గార్ల వీరన్న, బోయినపల్లి వెంకన్న,తేరాల లింగయ్య,బత్తిని భాస్కర్,నారాటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.