డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై చర్చ
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు త్వరలో ఇస్తామన్న అడిషనల్ కలెక్టర్ పురుషోత్తం
ఇందిరమ్మ ఇండ్లల్లో తిరిగిన అడిషనల్ కలెక్టర్
డోర్నకల్ ప్రతినిధి అక్టోబర్ 8 సంచలన వార్త:
డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో రైతు వేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ పురుషోత్తం పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి తెలుసుకొని వాటిని వెంటనే ఇండ్లు లేని నిరుపేదలకు పంచాలని అన్నారు.ఇందుకోసం గ్రామంలో ఉన్న వివిధ పార్టీ నాయకులు కలిసి అర్హులైన వారి పేర్లను ఇవ్వాలని అన్నారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చిందని వారికి బిల్లులు వచ్చాయా లేదా అని తెలుసుకున్నారు.దీనికోసం గ్రామంలో కలియతిరిగి ప్రతి ఇందిరమ్మ ఇండ్లకు వెళ్లి పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య,ఉపసర్పంచ్ వట్టె మల్లయ్య,గ్రామ కార్యదర్శి,వార్డు మెంబర్లు, గ్రామంలో ఉన్న వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.