నూతన ఎస్హెచ్ఓకు శాలువాతో సత్కారం తిరుమలాయపాలెం
మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
తిరుమలాయపాలెం:ప్రతినిది నవంబర్ 05 2026 (సంచలన వార్త)
తిరుమలాయపాలెం మండల పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ పోగుల సురేష్‌ను మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కటుకూరి శ్రీనివాస్ రెడ్డి, కాకరవాయి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ చైర్మన్ గుండాల లింగయ్య, యువజన నాయకులు కొత్తపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.