అన్నా చెల్లెల అనుబంధం రక్షాబంధన్ లిటిల్ మైండ్ స్కూల్లో రక్షాబంధన్ వేడుకలు

Spread the love

అన్నా చెల్లెల అనుబంధం రక్షాబంధన్

లిటిల్ మైండ్ స్కూల్లో రక్షాబంధన్ వేడుకలు
డోర్నకల్ ప్రతినిధి ఆగస్టు 27 సంచలన వార్త:
డోర్నకల్ మండలం చిలుకోడు లిటిల్ మైండ్ హై స్కూల్లో రక్షాబంధన్ వేడుకలు ప్రిన్సిపల్ గోగుల మల్సూర్ నిర్వహించారు.ప్రతి తరగతిలో రక్షాబంధన్ గురించి కార్యక్రమం నిర్వహించి,ఆడపిల్లల ద్వారా మగ పిల్లలకు రాఖీలు కట్టించారు.ఈ సృష్టిలో అన్న చెల్లెల బంధం చాలా గొప్పదని వివరించారు. ఆ బంధాన్ని గుర్తు చేసేందుకు రక్షాబంధన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారని చెప్పారు. స్కూల్లో ప్రతి విద్యార్థి విద్యార్థులు సోదర భావాలతో కలిగి ఉండాలని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.