అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయమా..! జిరాక్స్ సెంటరా..?
నిత్యం పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు..ప్రజల రద్దీ..కీలకమైన ప్రభుత్వ రికార్డుల నిర్వహణపై ప్రశ్నలు
రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద అధికారుల కంటే డాక్యుమెంట్ రైటర్లే అత్యుత్సాహంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు
కౌంటర్‌లోకి ఎవరు పడితే వారు వెళ్తే..కౌంటర్ ఎందుకు..? అంటూ ప్రజల ప్రశ్న
రికార్డు రూమ్ భద్రతపై అనుమానాలు..సీసీ కెమెరాల పరిస్థితిపైనా సందేహాలు
“జిరాక్స్ కోసం వచ్చారు” అంటూ జూనియర్ అసిస్టెంట్ విచిత్ర వివరణ…!!!
” అయితే కౌంటర్‌లోకి ఎందుకు వెళ్లారనే దానిపై కొత్త ప్రశ్నలు
అసలు అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏం జరుగుతోంది..?
రంగారెడ్డి జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 28(సంచలన వార్త):
ఆస్తుల రిజిస్ట్రేషన్లు,ప్రభుత్వ రికార్డుల సంరక్షణ,ప్రజలకు సేవలందించడం వంటి అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వ్యవహారశైలిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో ప్రజలు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ఈ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా జరుగుతోంది..? అధికారుల బాధ్యతలు ఏమిటి..? డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ఎంతవరకు ఉంటుంది..? ప్రభుత్వ రికార్డులు ఎంత భద్రంగా ఉన్నాయి..? రికార్డు రూమ్‌లో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి..? రిజిస్ట్రేషన్ కౌంటర్‌లోకి ఎవరికి ప్రవేశం ఉంది..? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా అధికారుల పరిధిలో ఉండాల్సిన రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద డాక్యుమెంట్ రైటర్లు కనిపించడం,రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన వ్యవహారాల్లో వారు చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు కనిపించడం పలు సందేహాలకు తావిస్తోంది. కౌంటర్‌లోకి ఎవరూ వెళ్లకూడదనే నిబంధనలు ఉంటే వాటి అమలు ఎక్కడ జరుగుతోంది..? కౌంటర్ లోపలికి వ్యక్తులు స్వేచ్ఛగా వెళ్లే పరిస్థితి ఉంటే అసలు కౌంటర్ ఏర్పాటు ఉద్దేశం ఏమిటి..? అనే ప్రశ్నలు వినియోగదారుల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కీలకమైన పత్రాలు భద్రపరిచే రికార్డు రూమ్ పరిస్థితి,అక్కడి భద్రతా ఏర్పాట్లు,సీసీ కెమెరాల ఉనికి,రికార్డుల నిర్వహణపై కూడా సమగ్ర పరిశీలన అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డాక్యుమెంట్ రైటర్లు కౌంటర్ లోపలికి వెళ్లడంపై వివరణ కోరగా జిరాక్స్ కోసం వచ్చారని జూనియర్ అసిస్టెంట్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయితే జిరాక్స్ కోసం వచ్చిన వారు రిజిస్ట్రేషన్ కౌంటర్ లోపలికి వెళ్లాల్సిన అవసరం ఏమిటన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై సంచలన వార్త వరుస పరిశీలనాత్మక కథనాలను ప్రచురించనుంది.
అధికారుల కౌంటర్‌లోకి డాక్యుమెంట్ రైటర్లు ఎందుకు..?
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పత్రాల తయారీకి సహకరించే డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ఒకటైతే,రిజిస్ట్రేషన్ కౌంటర్‌లో అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లుగా కనిపించడం మరో అంశమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కౌంటర్ అనేది అధికారిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగే ప్రదేశం కావడంతో అక్కడికి ఎవరికెంత వరకు అనుమతి ఉందనే అంశంపై స్పష్టత అవసరం. కౌంటర్ వద్దకు వచ్చే ప్రతి వ్యక్తి గురించి అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారా..? బయట వ్యక్తులకు కౌంటర్ పరిధిలోకి ప్రవేశించే అనుమతి ఏమైనా ఉందా..? ఉంటే ఆ అనుమతి ఎవరి ద్వారా వచ్చింది..? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.
కౌంటర్ లోపలికి ఎవరైనా వెళ్లే పరిస్థితి ఉంటే.. ప్రజలకు ప్రత్యేక కౌంటర్ ఎందుకు..?
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్‌కు,అధికారులు పనిచేసే అంతర్గత ప్రాంతానికి మధ్య స్పష్టమైన పరిమితి ఉండాల్సిన అవసరం ఉంది. అయితే కౌంటర్ లోపలికి బయట వ్యక్తులు వెళ్లే పరిస్థితి కనిపిస్తే,ఆ వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు రావడం సహజమే. “కౌంటర్‌లోకి ఎవరూ రాకూడదు” అనే నిబంధన ఉంటే దాని అమలు ఎవరు పర్యవేక్షిస్తున్నారు..? నిబంధనలు ఉల్లంఘించినప్పుడు అధికారులు ఏ చర్యలు తీసుకుంటున్నారు..? అనే అంశాలపై కార్యాలయ అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది.
“జిరాక్స్ కోసం వచ్చారు”..జూనియర్ అసిస్టెంట్ వివరణపై కొత్త సందేహాలు..
డాక్యుమెంట్ రైటర్లు కౌంటర్ లోపలికి వెళ్లడంపై వివరణ కోరిన సందర్భంలో జిరాక్స్ కోసం వచ్చారని జూనియర్ అసిస్టెంట్ చెప్పినట్లు సమాచారం. అయితే జిరాక్స్ కోసం కార్యాలయానికి వచ్చిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ కౌంటర్ లోపలికి వెళ్లాల్సిన అవసరం ఏమిటన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. జిరాక్స్ చేయడానికి కార్యాలయంలో ప్రత్యేక స్థలం ఉందా..? ఉంటే అక్కడి నుంచి కౌంటర్ వరకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..? జిరాక్స్ పేరుతో కౌంటర్ పరిధిలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉందా..? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
రికార్డు రూమ్‌కు భద్రత ఉందా..?
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని రికార్డు రూమ్ అత్యంత కీలకమైన ప్రదేశం. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పాత రికార్డులు,పత్రాలు,రిజిస్టర్లు భద్రపరిచే ప్రాంతం కావడంతో వాటి భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. రికార్డు రూమ్‌లోకి ఎవరు ప్రవేశిస్తున్నారు..? ప్రవేశాల వివరాలు నమోదు చేస్తున్నారా..? రికార్డుల రాకపోకలకు ప్రత్యేక నమోదు పద్ధతి ఉందా..? అగ్ని ప్రమాదం,నీటి లీకేజీ,దొంగతనం వంటి ప్రమాదాల నుంచి రికార్డులను రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వాల్సి ఉంది.
రికార్డు రూమ్‌లో సీసీ కెమెరాలు ఉన్నాయా..?
రికార్డు రూమ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని రికార్డు రూమ్‌లో సీసీ కెమెరాల పరిస్థితి ఏమిటన్నది పరిశీలించాల్సిన అంశంగా మారింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా..? ఏర్పాటు చేస్తే అవి పనిచేస్తున్నాయా..? రికార్డింగ్ ఎంతకాలం భద్రపరుస్తున్నారు..? రికార్డు రూమ్‌లోకి ఎవరెవరు ప్రవేశించారనే విషయం గుర్తించే విధంగా పర్యవేక్షణ వ్యవస్థ ఉందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రికార్డుల నిర్వహణకు బాధ్యత ఎవరిది..?
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రికార్డుల నిర్వహణ అనేది సాధారణ పని కాదు. భవిష్యత్తులో ఆస్తి వివాదాలు,న్యాయపరమైన అంశాలు,పత్రాల పరిశీలన వంటి సందర్భాల్లో పాత రికార్డులు కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉంది. అలాంటి రికార్డుల నిర్వహణకు బాధ్యత వహించే సిబ్బంది విధులు ఎలా కొనసాగుతున్నాయి..? రికార్డులను క్రమపద్ధతిలో భద్రపరుస్తున్నారా..? రికార్డులపై ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతున్నాయా..? పాత రికార్డులకు నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? అనే అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
నిత్యం పదుల రిజిస్ట్రేషన్లు..పర్యవేక్షణ మాత్రం ఎంత..?
అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో ఆస్తుల లావాదేవీలు,రిజిస్ట్రేషన్ల అవసరం పెరుగుతున్న నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఇలాంటి సమయంలో కార్యాలయంలో సిబ్బంది విధులు,ప్రజల సేవలు,పత్రాల భద్రత,కౌంటర్ నిర్వహణ వంటి అంశాలపై పటిష్టమైన పర్యవేక్షణ అవసరం. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రతి దశకు బాధ్యత వహించే అధికారి ఎవరు..? ప్రజల ఫిర్యాదులను స్వీకరించే విధానం ఏమిటి..? కార్యాలయంలో అనధికార ప్రవేశాలను నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు ఉన్నాయి..? అనే అంశాలపై కూడా సమగ్ర సమాచారం ప్రజలకు అందాల్సిన అవసరం ఉంది.
అసలు అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏం జరుగుతోంది..?
రిజిస్ట్రేషన్ కౌంటర్‌లో డాక్యుమెంట్ రైటర్ల ప్రవేశం నుంచి రికార్డు రూమ్ భద్రత వరకు..ప్రతి అంశంపై సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు భద్రంగా ఉన్నాయా..? కార్యాలయంలో విధులు నిబంధనల ప్రకారం కొనసాగుతున్నాయా..? బయట వ్యక్తుల పాత్ర ఎంతవరకు ఉంది..? అధికారుల పర్యవేక్షణ ఎలా ఉంది..? అనే అంశాలకు సంబంధించి సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైన సమాధానాలు రావాల్సి ఉంది.
వరుస కథనాలతో వాస్తవాలను వెలుగులోకి తీసుకురానున్న సంచలన వార్త…
ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు పారదర్శకంగా,నిబంధనలకు అనుగుణంగా సాగుతున్నాయా లేదా అన్నది అధికారిక రికార్డులు,క్షేత్రస్థాయి పరిశీలన,సంబంధిత అధికారుల వివరణల ఆధారంగా తేలాల్సి ఉంది. అందుకే అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ప్రతి అంశాన్ని ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ సంచలన వార్త వరుస సీరియల్ కథనాలను మీ ముందుకు తీసుకురానుంది.
(వేచి చుడండి సంచలన వార్త మరో సంచలనాత్మక కథనంతో మీ ముందుకు త్వరలో ఎపిసోడ్ 2 లో)