మృతుల కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్
డోర్నకల్ ప్రతినిధి అక్టోబర్ 8 సంచలన వార్త:
డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కాడెం రాజాలు చిత్రపటానికి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ నివాళులర్పించారు. వారి కుమారులైన కాడెం భిక్షం,కాడెం సైదులకు ధైర్యం చెప్పారు.అనంతరం వెన్నారం, రాముతండా బిఆర్ఎస్ పార్టీ నాయకులతో ముచ్చటిస్తూ బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కార్యచరణ గురించి చర్చించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.