*శ్రీ వడ్డి పోలమాంబ అమ్మవారి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలి: మల్లాడి రాజేంద్రప్రసాద్*
కాకినాడ జిల్లా ప్రతినిధి, సంచలన వార్త,నవంబర్ 04 :2026
కాకినాడ నగరంలోని జగన్నాధపురం 29వ డివిజన్ రెల్లి వీధిలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ వడ్డి పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా జనసేన పార్టీ కాకినాడ సిటీ నాయకులు మల్లాడి రాజేంద్రప్రసాద్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాడి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో నగర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఎంతో ఇష్టమైన రెల్లి కులస్తులు బాగా అభివృద్ధి చెందాలని తమ పార్టీ ఎప్పుడూ కోరుకుంటుందన్నారు. జాతర మహోత్సవాల నిర్వహణకు జనసేన పార్టీ తరఫున రెల్లి కుల పెద్దలకు రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.జాతర మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో బండి లక్ష్మీనారాయణ, గబ్బర్లతో పాటు కూటమి నాయకులు ముత్యాల అనిల్ కుమార్, దళాయి అరుణ్ కుమార్, ముత్యాల దేవరాజు తదితర నాయకులు, యువతీ యువకులు పాల్గొన్నారు.