*ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ*
మాజీ సొసైటీ వైస్ చైర్మన్ శెట్టి వెంకన్న ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం
అతిథులుగా పాల్గొన్న సర్పంచ్ జక్కుల కౌసల్య,ఉపసర్పంచ్ వట్టె మల్లయ్య
డోర్నకల్ ప్రతినిధి ఆగస్టు 31 సంచలన వార్త:
గత పది సంవత్సరాల నుండి ప్రజలకు అందుబాటులో లేని రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డులపై ప్రత్యేక దృష్టి సారించి పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు.సోమవారం డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో 34 షాప్ నందు స్మార్ట్ రేషన్ కార్డులను మాజీ సొసైటీ వైస్ చైర్మన్ శెట్టి వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథులుగా సర్పంచ్ జక్కుల కౌసల్య,ఉప సర్పంచ్ ఒట్టే మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. రేషన్ కార్డు పొందిన వాళ్లు తమ రేషన్ కార్డులను తీసుకున్నారు.ముఖ్యంగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.రేషన్ కార్డులు కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి కి,ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెన్నారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి రాము,వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.