మహిళలకు రక్షణ కల్పించడం మనందరి భాద్యత.
మహిళా సాధికారత కేంద్ర ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం..
ఖమ్మం సంచలన వార్త .నవంబర్ 04 2026
విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన భాద్యత మనందరిపైన ఉందని వైద్యధికారి ఐ దేవిశ్రీ అన్నారు. మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం యుపీహెచ్సీ వెంకటేశ్వరనగర్ లొ బేటీ భఛావో భేటీ పడావో కార్యక్రమం పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్న ఈ కార్యక్రమం లొ భాగంగా మహిళలపట్ల సమాజం ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపైన జరుగున్న లైంగిక, మానసిక, వ్యక్తిగత దాడులని పూర్తిస్తాయిలో నిరోధించాలని లక్ష్యంగా పనిచేస్తున్నా మహిళాసాధికారత కేంద్రం సేవలను ఆమె కొనియాడారు. బాలికలను కాపాడటం, బాలికలను చదివించడం ( బేటీ భఛావో భేటీ పడావో ) కార్యక్రమానికి ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. అనంతరం కార్యక్రమం లొ పాల్గొన్న ఖమ్మం మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆఆర్డినేటర్ సమ్రీన్ ఆధ్వర్యంలో ప్రత్యేక నిపుణులు వాసంతి, ప్రమీల మాట్లాడుతూ ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. మహిళా ఉద్యోగులు, మహిళల గౌరవానికి భంగం కలిగే పరిస్థితులు ఉత్పన్నామైనా 181 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. మహిళల్లో అక్షరాశ్యత పెంచడం పురుషులతో సమానంగా పురోగతి సాధించేలా కృషిచేయడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని వివరించారు. అలాగే ప్రజల వద్దనుండి వచ్చిన ప్రతీ సమాచారం గొప్యంగా ఉంచడం జరుగుతుందని తమకార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమం లొ హెచ్ ఈ ఓ వీరన్న, సూపర్ వైజర్ జడ్ ఎస్ జయపాల్, సిస్టర్లు శారదా, రహీంబి, ప్రసన్న, సంధ్య, ఆశకార్యాకర్తలు పాల్గొన్నారు…