రైతులను వనికిస్తున్న బూజు( ఫంగస్) రోగం సారవంతమైన భూములు ఏర్పాటు చేసుకోవాలన్న వ్యవసాయ అధికారులు ముందస్తు సుడోమోనాస్ ట్రైకోడెర్మా వేసుకోవాలన్న శాస్త్రవేత్తలు

Spread the love

రైతులను వనికిస్తున్న బూజు( ఫంగస్) రోగం

సారవంతమైన భూములు ఏర్పాటు చేసుకోవాలన్న వ్యవసాయ అధికారులు

ముందస్తు సుడోమోనాస్ ట్రైకోడెర్మా వేసుకోవాలన్న శాస్త్రవేత్తలు

డోర్నకల్ ప్రతినిధి నవంబర్ 04 2026 సంచలన వార్త:
రైతుల పాలిట మిర్చి తోటకు బూజు రోగం శాపంలో తయారయింది. మండలంలోని పలు గ్రామాలలో ఈ రోగం అధికం అవ్వడంతో ఎక్కడి చెట్లు అక్కడే చనిపోతూ ఒక చెట్టు నుండి మరి చెట్టుకు పాకుతుంది.కాయ దశకు వచ్చిన చెట్లు నేలమట్టం కావడంతో రైతులు అయోమయ పరిస్థితులలో నివారణ తగ్గించడం కోసం వివిధ రకాల మందులను స్ప్రే చేస్తున్నారు.బ్లూ కాపర్,రెడిమెల్ గోల్డ్,ప్లాంటోమైసిన్, ఎవర్ గోల్డ్ ఎక్స్టెండ్ ఇలాంటి రసాయన మందులు వాడుతున్న తగ్గలేదు అని రైతులు వాపోతున్నారు.భూమి సారవంతంగా లేనప్పుడు ఇటువంటి బూజు లాంటి బ్యాక్టీరియా మొక్కలపై దాడి చేస్తాయని వ్యవసాయ అధికారులు చెప్పుకొచ్చారు.రైతులు ముందస్తుగా సుడోమోనాస్,ట్రైకోడెర్మా లాంటి ఫంగిసైడ్లను వేసుకోవాలన్నారు. ఇవి మొక్కలకు భూమిలో బ్యాక్టీరియాను ఎదుర్కొంటుందని వెల్లడించారు.బూజు రోగం వచ్చిన మొక్కల నుండి ఆరోగ్యవంతమైన మొక్కలను రక్షించుకోవడమే సత్వర పరిష్కారమని అన్నారు.