త్రివేణి లో ఘనంగా ప్లాస్టిక్ బ్యాగ్ నివారణ దినోత్సవం*

Spread the love

*త్రివేణి లో ఘనంగా ప్లాస్టిక్ బ్యాగ్ నివారణ దినోత్సవం*

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిది జులై 03 2026 (సంచలన వార్త )
“ప్లాస్టిక్ బ్యాగ్ కి స్వస్తి పలుకుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే నినాదంతో,
ప్లాస్టిక్ బ్యాగ్ వినియోగం వల్ల పర్యావరణానికి, జీవరాశులకు మానవ ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతుందని , దానిపై అవగాహన కల్పించేందుకు మా త్రివేణి లో ప్లాస్టిక్ బ్యాగ్ నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి తెలియజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్లాస్టిక్ సంచులకు బదులుగా వస్త్ర సంచులను, జ్యూట్ బ్యాగులను, మరియు పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగిస్థామని ప్రతిజ్ఞ చేశారు.
పాఠశాల ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్ధాలు పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తూ నేల, నీరు, గాలి కాలుష్యానికి కారణం అవుతున్నాయని తెలిపారు.
పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు
“*ప్లాస్టిక్ నో చెప్పండి ప్రకృతికి అవును అని చెప్పండి*”
“*ఈరోజు వస్త్ర సంచి వాడుదాం – భావితరాలకు స్వచ్ఛమైన భూమిని అందిద్దాం* ”
వంటి నినాదాలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతి ప్రధానం చేశారు…
ఈ కార్యక్రమంలో పాఠశాల సిఆర్ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ స్వప్న ,ముస్తఫా , క్యాంపస్ ఇంచార్జ్ విక్టర్ చార్లెస్, ట్రాన్స్పోర్ట్ ఇంచార్జ్ సందీప్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.