* రిజిస్ట్రేషన్‌కో రేటు..!!!
మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వసూళ్ళ దందా…?
* మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది.
” అడిగినంత ఇస్తే కానీ ఇళ్లు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ కావడం లేదు…?
* డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ముడుపులను పుచ్చుకుంటున్నారు అని జిల్లాలో గుసగుసలు…?
” జిల్లా అధికారి సీసీ పుటిజ్ పరిశీలిస్తే వసూళ్ళ దందా బట్టబయలు అవుతుంది …!!!
” అటెండర్ గౌస్ చేతివాటం చూస్తే జిల్లా అధికారి తనిఖీలు శూన్యం అని చెప్పవచ్చు …?
” అటెండర్ వేళల్లో సబ్ రిజిస్టర్లు లక్షల్లో దందా దందా అంతా బహిరంగమే సీసీల పరిధిలోనే..
* కొన్ని పెద్ద రిజిస్ట్రేషన్లపై ఏకంగా రూ.లక్షపైనే దండుకుంటున్నట్లు సమాచారం…!!!
* రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు ఎస్ఆర్వో, సిబ్బంది వాటా ముట్టజెప్పితేనే రిజిస్ట్రేషన్ పని పూర్తవుతోంది అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి…!!!
” ఈ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డ్ ఇంకా ప్రజలకి సూచనలు చెప్పే బోర్డ్ లు అంటే లెక్కనేలేదు బోర్డ్ మీద ఒకళ్ళు కుర్చీలో మరొకల్లు …
తెలంగాణ స్టేట్ బ్యూరో ప్రత్యేక కధనం 1 జులై 03 2026 (సంచలన వార్త)
రిజిస్ట్రేషన్‌కో రేటు..!
మంచిర్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అన్నీ సక్రమంగా ఉన్నా.. ఏదో ఒక తిరకాసు పెడుతూ రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు, కొన్ని పెద్ద రిజిస్ట్రేషన్లపై ఏకంగా రూ.లక్షపైనే దండుకుంటున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు ఎస్ఆర్వో, సిబ్బంది వాటా ముట్టజెప్పితేనే రిజిస్ట్రేషన్ పని పూర్తవుతోంది.
ఎస్ఆర్వో డాక్యుమెంట్ రైటర్లను ఏజెంట్లుగా పెట్టుకొని దందా సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మొత్తంగా పైసలిస్తే కానీ.. పనికావడం లేదు. పని త్వరగా పూర్తికావాలంటే అధికారుల చేతులు తడపాల్సిందే.
అసలు ఎలాంటి రిస్క్ లేకుండా పేపర్ వర్క్ స్మూత్‌గా అయిపోవాలంటే మధ్యవర్తులను సంప్రదించాల్సిందే. ప్రతీపనికి రేటు ఫిక్స్ చేసి మరీ కార్యాలయ అధికారులు మధ్యవర్తులను నియమించుకుని అడ్డగోలుగా దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మూడు లంచాలు.. ఆరు అక్రమాలుగా అవినీతి వర్ధిల్లుతోంది. కార్యాలయంలో వివిధ సేవలకు సమయపాలన అంటూ లేకపోవడం గమనార్హం.
భూముల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు చేసేందుకు గరిష్టంగా 24 గంటల సమయం పడుతుండగా, కంప్యూటరైజ్డ్ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) జారీకి గంట, అలాగే ఈసీ నకలు మ్యానువల్‌గా ఇచ్చేందుకు 24 గంట లు, పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌కు గంట, పెండింగ్ డాక్యుమెంట్లు ఇచ్చేందుకు ఒక రోజు, పెండింగ్ డాక్యుమెంట్లు సెక్షన్ 47-ఏ కింద జారీ చేసేందుకు 7 రోజులు, భూముల మార్కెట్ వాల్యువేషన్ సర్టిఫికేట్లు ఇచ్చేందుకు గంట సమయం కేటాయిస్తూ సిటిజన్ చార్టులో పేర్కొంట్టారు . అయితే ఇవ్వన్ని నామమాత్రమే. అదనంగా ముడుపులు చెల్లిస్తేనే పనులు జరుతాయి. లేకుంటే రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని మంచిర్యాల వాసులు పేర్కొంటుండటం గమనార్హం.
చేయి తడపాల్సిందే..!
మంచిర్యాల కేంద్రంలో ఇబ్బడి ముబ్బడిగా వెంచర్లు వెలుస్తున్నాయి. వీటిల్లో కొన్నింటికి ఎటువంటి అనుమతులులేవు. ఇది సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులకు కాసులు కురిపిస్తోంది. ప్లాట్‌కు రూ.10 వేలు 20 వేలు ఒక లక్ష ఇస్తే చాలు, అభ్యంతరాలు లేకుండా,నిబంధనలను తుంగలో తొక్కి, ఎంచక్కా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు సమాచారం. కార్యాలయంలో చేయి తడపందే ఏ పనీ జరగడం లేదు. అని జిల్లాలో గుసగుసలు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమ రేజిస్ట్రేషన్లు చేస్తూ వసూళ్ళకి తెగబడుతున్న రిజిస్టర్ పై తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్న మంచిర్యాల జిల్లా ప్రజలు…
(వేచి చుడండి సంచలన వార్త ఆవు చేలో మేస్తే దూడ గేట్టున మేస్తుందా మంచిర్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అటెండర్ స్థాయి నుంచి మొదలు సబ్ రిజిస్టర్ వరకు వసూళ్ళ కంప్పు వివరాలు త్వరలో మరో సంచలనాత్మక కథనంతో ఎపిసోడ్ 2 మీ ముందుకు )